అనంతపురం లో అన్ని యుద్ధాలే ...!!

Update: 2018-08-05 18:29 GMT

ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి చోటా రాజకీయ యుద్ధాలు మొదలయిపోయాయి. సందర్భం ఏదైనా, వేదిక ఏమైనా కావొచ్చు ఎవరి పార్టీ క్రెడిట్ కోసం వారు కొట్లాటలు స్టార్ట్ చేస్తున్నారు. దీనికి మరో తార్కాణం అనంతపురం లో నిర్వహించిన తాగునీటి సంఘాల సమన్వయ సమావేశం రసాభాసగా మారడమే. హంద్రీ నీవా నీళ్ళు చంద్రబాబు కృషి వల్లే వచ్చాయని ఆయనకు అంతా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలంటూ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అసలు కథ ఇంతవరకు వచ్చిందంటే కేవలం వైఎస్ కృషి అంటూ వైసిపి ఎమ్యెల్యే విశ్వేశ్వర రెడ్డి వాదనకు దిగడంతో సమావేశం చర్చకు బదులు రచ్చకు దారితీసింది.

వైసిపి ఎదురుదాడితో ...

సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమా తదితరులు అంతా ఉండగానే విశ్వేశ్వర రెడ్డి పదునైన వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు అవాక్కయ్యారు. ఇద్దరినడుమ చాలా సేపు వాగ్యుద్ధం నడించింది. వైఎస్ ఉండి ఉంటే నీరు ఇప్పటికి రాదంటూ మంత్రి కాల్వ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో విశ్వేశ్వర రెడ్డి బాగా ఫైర్ అయ్యారు. ఇలా ఇటీవల కాలంలో జిల్లా పరిషత్ సమావేశాలు, మునిసిపల్ సమావేశాలు ఇలా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో వైసిపి టిడిపి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారానికి అడుగడుగునా అడ్డు తగులుతుంది. వైఎస్ హయాంలో జరిగినవి తమ ఖాతాలో వేసుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తుందని వైసిపి ఆరోపిస్తూ వస్తుంది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని విపక్షం ఆరోపిస్తుంది. దీనిని తాము సమర్ధవంతంగా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంది. మొత్తానికి రాజకీయం వేడెక్కడంతో ఏ సమావేశంలో ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.

Similar News