అవిశ్వాస తీర్మానంపై చర్చకు అన్ని పార్టీలూ సహకరించాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఆయన ట్వీట్ ద్వారా అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్ కోరారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అన్ని పార్టీలూ సహకరించి అవిశ్వాసానికి సహకరించాలని జగన్ మరోసారి తన ట్వీట్ ద్వారా కోరారు.