వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమవుతుందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు గాని, బీజేపీకి గాని రాష్ట్రంలో ప్రత్యేకించి బలం లేదని, ఏదో ఒక పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిందేనన్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చంద్రబాబే ప్రచారం చేయిస్తున్నారన్నారు. చంద్రబాబుపై అనేక అవినీతి కేసులున్నాయని, అందుకే బీజేపీతో విభేధించరని ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తెలిపారు. అయితే ఏమైనా జరగొచ్చని, బీజీపీపైన, మోడీపైన వ్యతిరేకత ఉంటే చివరి క్షణంలో చంద్రబాబు పొత్తు నుంచి తప్పుకునే అవకాశముందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవరితోనూ తాను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని జగన్ తెలిపారు.