అడవిలో అన్న లు తెలుగు వారే మిగిలారా....?

Update: 2017-12-26 00:30 GMT

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అలజడి రేగుతోంది. పార్టీ పంధాను మార్చుకోకపోవడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన ఇప్పుడు పోరాటాలు జరపడం లేదని లొంగిపోయినవారు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇరవై మందికి పైగా ఉన్న సెంట్రల్‌ కమిటీ సభ్యుల సంఖ్య ఇప్పుడు 18కి పడిపోయింది. ఇప్పుడు కమిటీలో పాతతరం మాత్రమే ఉండిపోయింది. ఇందులో పన్నెండు మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే నాయకులుగా వున్నారు. ఈ సెంట్రల్ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు? వారి వివరాలేంటనేది ఇప్పడు తెలుసుకుందాం...

కీలకపోస్టుల్లో....

మావోయిస్టు పార్టీని లీడ్ చేస్తోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అని చెప్పవచ్చు. అంతేకాకుండా కీలకమైన పోస్టుల్లో కూడా తెలుగు వారే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో పది మంది తెలంగాణ, ఇద్దరు ఆంధ్రాకు చెందిన వారు వున్నారు. మొత్తం 18 మంది సభ్యుల్లో పన్నెండు మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే...! ఇప్పుడు పార్టీలో సైద్ధాంతికంగా మార్పు రాక పొవడంతో వారిలో చాలా మంది బయటకు వస్తున్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ సెక్రటరీగా ముప్పాళ్లు లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లీడ్ చేస్తున్నాడు. పార్టీలో సుదర్ఘీంగా పనిచేస్తున్న వారిలో గణపతి ఒక్కడు అని చెప్పావచ్చును. తరువాత స్థానంలో నంబాళ్లు కేశవ రావు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేశవ రావు కూడా సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్.. పెద్ద పల్లికి చెందిన ఈ మల్లోజుల కుటుంబం మొత్తం కూడా మావోయిస్టుల తో సంబంధాలు పెట్టుకుంది. మల్లొజుల కోటేశ్వరరావు సొదరుడే వేణుగొపాలు.. కటకం సుదర్శన్. ఆదిలా బాద్ కు చెందిన కటకం మెరుపు దాడులు చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. మల్లా రాజిరెడ్డి. కరీంనగర్ కు చెందిన రాజిరెడ్డి కొన్నాళ్లు వరకు కూడా జైల్లో నే వున్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత మళ్లీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపొయాడు. కోరుట్ల కు చెందిన తిప్పరి తిరుపతి 2009 వరకు కూడా జైల్లో వున్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత తిరిగి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు.

పట్టున్న నేతలు....

పదో స్దానంలో వున్న జీనుగు నర్మింహ్మా రెడ్డి అలియాస్ జంపన్స్ ఇప్పడు లొంగిపొయాడు.33 ఏళ్లు పాటుగా పార్టీలో ఉన్న జంపన్న పోలీసుల ఎదుట లొంగిపొయాడు. పార్టీ సైద్ధాంతిక పద్ధతి నచ్చక పొవడంతో లొంగి పొతున్నాట్లు చెప్పాడు..మావోయిస్టు పార్టీ అంటే తెలుగు ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్ కె.. ప్రస్తుతానికి పదకొండో స్దానంలో వున్నాడు ఆర్ కె.. పార్టీలో అంత్యంత సీనియర్ అని చెప్పవచ్చును. ఆర్ కె అలియాస్ రామకృష‌్ణ ప్రభుత్వంతో చర్చల పక్రియను ఆరంభించాడు,అయితే తరువాత ఈ పక్రియకు పుల్ స్టాప్ పడింది. సిరిసిల్లకు చెందిన కడారి శ్రీధర్ .. ఇతనికి కూడా పార్టీలో మంచి పట్టు వుంది.. హైదరబాద్ కు చెందిన మోడం బాలకృష్ణ.. 51 ఏళ్లు వున్నా మావో పార్టీలో కీలకం. ఇతను గణపతికి అంత్యంత సన్నిహితుడు. పులురి ప్రసాద్..... పెద్ద పల్లికి చెందిన ఈ ప్రసాద్ సెంట్రల్ కమిటిలో పదహారో స్దానంలో వున్నాడు. మెరుపు దాడులు చేయడంతో పాటుగా తప్పించుకునే యుద్ధ విద్యాల్లో ప్రసాద్ దిట్ట.. అతి కొద్ది కాలంలోనే సెంట్రల్ కమీటి సభ్యుడు గాచేరిన రావుల శ్రీనివాస్. ఇప్పటి వరకు జరిగిన అన్న ముఖ్యమైన దాడుల్లో ఇతని ఆధ్యర్వంలోనే జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒగ్గు సుధాకర్.. ఇతని భార్య కూడా ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీలో 18వ స్థానంలో వున్నారు. మావోయిస్టు పార్టీలో వున్న వీరు జనజీవన స్రవంతిలో కి రావాలని పోలీసులు కోరుతున్నారు.

Similar News