అచ్చం నాన్నలాగానే....!

Update: 2017-12-01 01:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అచ్చం వైఎస్ పాదయాత్ర లాగానే సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వృద్ధులను, రైతులను, డ్వాక్రా మహిళలతో కూర్చుని వారితో చర్చించడం అంతా ప్రతిరోజూ జరుగుతోంది. వైఎస్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారులకు నామకరణం చేశారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ అనేకమంది చిన్నారులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా నాన్న బాటనేపట్టినట్లున్నారు. ఇటీవల ఒక బాలుడికి రాజశేఖర్ అని నామకరాణం చేశారు. తాజాగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన కూతురికి నామకరణం చేయాల్సిందిగా జగన్ పాదయాత్ర వద్దకు వచ్చి అభ్యర్థించారు. దీంతో జగన్ ఆ చిన్నారికి ‘రేయాన్ష’అని పేరుపెట్టారు. ఇది చూసిన క్యాడర్ వైఎస్ లాగానే జగన్ కూడా అందరితో కలుపుగోలుతనంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరోవైపు హామీలు కూడా జగన్ బాగానే గుప్పిస్తున్నారు. ఆయనను వెలుగు యానిమేమటర్లు కలిశారు. వారికి నెలకు పదివేల జీతం తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తానని హామీ ఇచ్చారు.

నేటి షెడ్యూల్ ఇదీ....

వైఎస్ జగన్ పాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఆయన మామూలుగా సీబీఐ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే నేడు కోర్టుకు సెలవు కావడంతో జగన్ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు. జగన్ శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జగన్ జుటూర్, చిన్నహుల్తి లో పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం పత్తికొండలో భోజన విరామానికి ఆగుతారు. తర్వాత పత్తికొండ లోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత తొలి శుక్రవారం పాదయాత్ర చేయడం విశేషం.

Similar News