అగస్టా కుంభకోణంలో ఎస్.పి. త్యాగి అరెస్టు

Update: 2016-12-09 20:12 GMT

3767 కోట్ల రూపాయల విలువైన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో వైమానికదళం మాజీ చీఫ్ ఎస్పి త్యాగిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మన దేశంలో ఆర్మీ విభాగాల్లో ఒకదానికి చీఫ్ గా పనిచేసి అరెస్టు అయిన మొదటి వ్యక్తి త్యాగి కావడం విశేషం. యూకెలోని ప్రెవేటు హెలికాప్టర్ల కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ నుంచి వీవీఐపీ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినందుకు ఎస్‌పి త్యాగితో పాటు ఆయన బంధువు జూలీ త్యాగి, ఢిల్లీలోని న్యాయవాది గౌతమ్ ఖైతాన్ లను కూడా అరెస్టు చేశారు. ఒకవైపు త్యాగి తమ మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తుండగా, వారిని విచారణకు పిలిపించిన సీబీఐ అక్కడే అరెస్టు చేసింది.

అగస్టా కుంభకోణం లో మొత్తం కొనుగోళ్ల విలువ 3767 కోట్లు కాగా, 12 శాతం లంచాలు స్వీకరించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు.

Similar News