ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాజీ మంత్రి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నియోజకవర్గంలో పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి గాలి కుటుంబానికే టిక్కెట్ అని సంకేతాలు వచ్చాయా? అన్న అనుమానం కలుగుతుంది. దీంతో గాలి గత కొద్ది నెలలుగా నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నగరిలో గాలి కుటుంబం నుంచి ఆయన గాని, ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు గాని పోటీచేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ముగ్గురూ నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలి దూకుడు పెంచారు. నగరి నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్ అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రాతనిధ్యం వహిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
అవినీతిలో నగరి నెంబర్ వన్ అన్న రోజా....
అయితే నగరి నెంబర్ వన్ నియోజకవర్గమని గాలి చెప్పడాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గం అవినీతి అక్రమాల్లో నెంబరు వన్ చెప్పడం విశేషం. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ అని రోజా చెప్పటానికి బలమైన కారణాలే ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో అధికారులు ఎమ్మెల్యే రోజా చెప్పిన పనులు చేయడం లేదట. ఇన్ ఛార్జిగా ఉన్న గాలి చెప్పిన మాటలే వింటున్నారట. తాను రోడ్ల అభివృద్ధికోసం నిధులు మంజూరు చేయించుకుంటే దానిని గాలి అధికారులను బెదిరించి రద్దు చేయించారని రోజా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రోజా ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ పనులు మాత్రం గాలి చెప్పినట్లే జరుగుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది.