అక్కడ పవన్ హల్ చల్ ...!

Update: 2017-11-20 04:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లండన్ లో హల్చల్ చేస్తున్నారు. ఐ ఈ బిఎఫ్ అంతర్జాతీయ అవార్డు ను అందుకునేందుకు లండన్ వెళ్ళిన పవన్ అక్కడి ప్రవాసభారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమాల్లో సమస్యలు పరిష్కరించలేం. రాజకీయాల్లో ఎక్కువ సేవ చేసే అవకాశం లభిస్తుంది. సామాజిక సేవ నా లక్ష్యంగా జనసేన పార్టీని ఏర్పాటు చేశా. సేవ చేసే ప్రతివారికి నా అవార్డు అంకితం అంటూ ప్రసంగించారు పవన్. భారత్ పెట్టుబడులకు మంచి అవకాశం వున్న దేశమని కూడా చెప్పుకొచ్చారు. ఇండియా లో సామాన్యులు వున్నారు ధనికులు ఉన్నారు కనుక విదేశీ పెట్టుబడులకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు.

అంబేద్కర్ స్మారక మందిరాన్ని సందర్శించిన పవన్ ...

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారక మందిరాన్ని లండన్ లో సందర్శించి చాలా సేపు అక్కడి ఫోటో గ్యాలరీని పాత జ్ఞాపకాలను చూస్తూ గడిపారు పవన్ కళ్యాణ్. కొన్ని ఫోటోలను ఆసక్తిగా తిలకిస్తూనే తన మొబైల్ లో వాటిని ఫోటోలు తీసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జ్ఞాపకాలను పదిలం గా భద్రపరిచిన తీరును పవన్ ప్రశంసించారు.

విదేశీ పర్యటన తరువాత జనసేన జోరు అందుకుంటుందా ..?

సినిమాలు, విదేశీ పర్యటనలతో బిజీ బిజీ గా వున్న పవన్ కళ్యాణ్ త్వరలో పార్టీ గేరు మార్చి స్పీడ్ పెంచుతారని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక పక్క విపక్ష నేత ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి దూసుకు వెళుతున్నప్పటికీ జనసేన పార్టీ నిర్మాణంలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. దాంతో జనసైనికులు తమ నేత ఎప్పుడు పిలుపు ఇస్తారా జనంలోకి దూసుకుపోదామని ఆశగా ఎదురు చూస్తున్నారు. పికె లండన్ టూర్ తరువాత ప్లీనరీ, బస్సు యాత్ర లు వంటి వాటిపై క్లారిటీ కూడా జనసేన ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Similar News