మత్సకారులపై వల విసిరిన వైసిపి చీఫ్

Update: 2018-07-22 01:28 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నేతల హామీలు కోటలు దాటేలా వున్నాయి. కులం, మతం, ప్రాంతం ఇలా ఏది వీలైతే అది విడతీసి మరీ అధికార ప్రతిపక్షాలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ హామీల వర్షం వైసిపి లో ఇప్పుడు తుఫాన్ మాదిరి మారిపోయింది. వైసిపి చీఫ్ ప్రకటిస్తున్న వరాలు చూసి అధికారపార్టీ కి షాకులు తగులుతున్నాయి. ప్రతిపక్ష నేత ప్రకటించారు కనుక మేము వచ్చాకా ఇస్తాం అని చెప్పడానికి వారు ప్రస్తుతం అధికారంలో వున్నారు. సో ప్రజలు ఇప్పుడే హామీ అమలు చేయమని డిమాండ్ చేసే పరిస్థితి. దాంతో విపక్ష నేత హామీల వరదకు అడ్డే లేకుండా పోయింది.

మత్సకారుడు చనిపోతే 10 లక్షలన్న జగన్ ...

ప్రకృతి ఉపద్రవాలు సంభవించి మత్సకారులు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు వైసిపి చీఫ్ జగన్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం మీదుగా పెద్దాపురం నియోజకవర్గం వైపు సాగుతున్న జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మత్సకారుల అధికంగా వుండే ఈ ప్రాంతంలో ఆ వర్గం సమస్యలు విన్న జగన్ వైసిపి అధికారంలోకి వస్తే తప్పని సరిగా అన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చేపల వేటకు వెళ్ళి జీవనాధారమైన వ్యక్తి మృత్యు వాత పడితే ఆ కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలబడతామని చెప్పుకొచ్చారు

Similar News