అవంతికి మరోసారి జగన్ చురకలు

మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మద్యనిషేధంపై చర్చించారు. దశల వారీగా మద్యనిషేధం అమలుపై మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. [more]

Update: 2019-11-27 12:39 GMT

మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మద్యనిషేధంపై చర్చించారు. దశల వారీగా మద్యనిషేధం అమలుపై మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. రిటైల్ షాపుల్లో ఒకరికి ఒక బాటిల్ మాత్రమే ఇవ్వాలన్న నిబంధన విధించాలన్నారు. అయితే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం మద్యనిషేధంతో ఏపీలో టూరిజం దెబ్బతింటుందని అన్నారు. అయితే దీనికి జగన్ టూరిజం ముఖ్యమా? సమాజం ముఖ్యమా? అని ప్రశ్నించారు. పర్యాటకానికి వచ్చే వాళ్లు ఫ్యామిలీలతో వస్తారని, వారు పర్యటకప్రాంతాలను ఎంజాయ్ చేస్తారు కాని, మద్యం కోసం చూడరని జగన్ అభిప్రాయపడ్డారు. మద్యం ధరల పెంపుదలపై కూడా కొందరు మంత్రులు వ్యతిరేకత ఉందని చెప్పగా, మద్యాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం పెంచాలని జగన్ అభిప్రాయపడ్డారు. మహిళ మంత్రులందరూ ఏకాభిప్రాయంతో మద్యనిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని చెప్పారు.

Tags:    

Similar News