జగన్ ను బాధపెట్టిన అంశమిదే

మ్యానిఫేస్టోను తాను పవిత్ర గ్రంధంగా భావిస్తానని నాడు చెప్పానని, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు నెలల్లోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మంచి పాలన జరుగుతుంటే [more]

Update: 2019-12-02 06:52 GMT

మ్యానిఫేస్టోను తాను పవిత్ర గ్రంధంగా భావిస్తానని నాడు చెప్పానని, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు నెలల్లోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మంచి పాలన జరుగుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు. నా మతం, నా కులం గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారన్నారు. మనసుకు చాలా బాధ కలిగిందని చెప్పారు. తన మతం మానవత్వమేనని జగన్ చెప్పారు. తన కులం మాటను నిబలెట్టుకోవడమేనని చెప్పారు. విపక్షాల మాటలను తాను పెద్దగా పట్టించుకోక పోయినప్పటికీ మతం, కులాలను ముఖ్యమంత్రికి అంటగడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అయినా తాను వేటినీ పట్టించుకోనని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News