ఏడాదిలో ఇవన్నీ చేశా…. మరిన్ని చేస్తా

వివక్ష లేని పాలన అందించాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తనకు ఓటు వేయని వారు కూడా అర్హత ఉంటే వారికి అన్ని సంక్షేమ [more]

Update: 2020-05-25 07:26 GMT

వివక్ష లేని పాలన అందించాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తనకు ఓటు వేయని వారు కూడా అర్హత ఉంటే వారికి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఆయన అన్ని జిల్లాల కేంద్రాల నుంచి లబ్దిదారులు, నిపుణలతో జగన్ ఏడాది పాలనపై సమీక్ష జరిపారు. ఏడాది పాలనపై ఏపీ ప్రభుత్వం మేధో మధనసదస్సులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా జగన్ మాట్లాడారు. మనసా, వాచా, కర్మణా నీతివంతమైన పాలన అందించాలన్నదే తన ప్రయత్నమన్నారు. అందుకే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు 14 నెలలు పాదయాత్ర చేసి ప్రజలతో మమైకమై వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ప్రతి యాభైై ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించామని చెప్పారు.

90 శాతం మ్యానిఫేస్టో పూర్తి…..

ఏడాది కాలం పరిపాలన తనకు సంతృప్తి కల్గించిందన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు. ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. మద్యం షాపులు ప్రయివేటు వ్యక్తులు నడిపితే బెల్టు షాపులను రద్దు చేయలేమని భావించి ప్రభుత్వం ద్వారానే విక్రయిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడం లేదన్నారు. మద్య నిషేధం దిశగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు 24 శాతం తగ్గాయన్నారు. మ్యానిఫేస్టోలో 90 శాతం ఒక్క ఏడాదిలోనే అమలు చేశామన్నారు. ఏడాది కాలంలో మూడు కోట్ల యాభై ఏడు లక్షల యాభై ఆరు వేల మంది ఏడాది కాలంగా లబ్ది పొందారని జగన్ చెప్పారు. ఇంటింటికి మ్యానిఫేస్టోను కూడా పంపుతామని జగన్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రజలకు చేరుస్తానని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News