పది నెలల తర్వాత వచ్చిన జగన్?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది నెలల తర్వాత తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. పది నెలల కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. [more]

Update: 2020-03-16 01:40 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది నెలల తర్వాత తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. పది నెలల కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాజధానుల అంశం, శాసనమండలి రద్దు, ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకోవడం వంటి అంశాలను మాట్లాడాలని మీడియా మిత్రులు భావించారు. కానీ జగన్ మాత్రం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వరకే పరిమితమయ్యారు. దాదాపు నలభై ఐదు నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించిన జగన్ ఎన్నికల కమిషనర్, చంద్రబాబు పైనే నిప్పులు చెరిగారు. తాను చెప్పదలచుకుందీ చెప్పి వెళ్లిపోయారు. మీడియా సమావేశంలో ప్రశ్నలకు ఆస్కారం లేకుండా పోయింది. పది నెలల తర్వాత తమ ముందుకు వచ్చిన జగన్ ను ఎన్నో ప్రశ్నలు అడగాలని, ఆయన నోటి నుంచే సమాధానాలు వినాలనుకున్న మీడియా మిత్రులకు నిరాశే ఎదురయింది. ఎన్నికల వాయిదాతో జగన్ ఆగ్రహంగా కన్పించడంతో మీడియా మిత్రులు కూడా ప్రశ్నలు వేసేందుకు వెనకడుగు వేశారు.

Tags:    

Similar News