బ్రేకింగ్ : చంద్రబాబు తట్టుకోలేకే ఈ కుట్రలు

గతంలో ఎప్పుడైనా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయా? అని జగన్ ప్రశ్నించారు. కేవలం 47 చోట్ల మాత్రమే కొన్ని ఘటనలు జరిగాయన్నారు. పోలీసులు 8 మంది పై [more]

Update: 2020-03-15 10:06 GMT

గతంలో ఎప్పుడైనా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయా? అని జగన్ ప్రశ్నించారు. కేవలం 47 చోట్ల మాత్రమే కొన్ని ఘటనలు జరిగాయన్నారు. పోలీసులు 8 మంది పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. ఎక్కడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేదన్నారు. చంద్రబాబు రాక్షస క్రీడకు పాల్పడుతున్నారన్నారు. ఏకగ్రీవం కావడం కొత్తేమీ కాదన్నారు. 2013 లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ఏకగ్రీవంగా అన్నీ గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని అన్నారు. ఎన్నికల కమిషన్ లోనూ జోక్యం చేసుకుని చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఎన్నికలు మార్చి 31వతేదీలోపు పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల కోట్లు నిధులు వస్తాయని, ఎన్నికలు జరగకపోతే రావని జగన్ ఆవేదన చెందారు. ఏపీకి నష్టం చేయాలనే ఇన్ని కుట్రలు పన్ను తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికకాక పోవడంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. కరోనా భవిష్యత్తులో తగ్గుతుందన్న గ్యారంటీ ఏమిటని జగన్ ప్రశ్నించారు. కేవలం ఏపీకి నష్టం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గవర్నర్ కు కూడా ఎన్నికల కమిషనర్ పై ఫిర్యాదు చేశామన్నారు. అప్పటికీ మార్పు రాకుంటే పైస్థాయిలోకి వెళ్లి చర్యలు తీసుకోమని కోరతామన్నారు.

Tags:    

Similar News