9గంటల తర్వాతే తెలుస్తుందట

ీమరికొద్దిసేపట్లో జరగబోయే మంత్రి వర్గ సమావేశంలోనే రాజధాని అమరావతి అంశంపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకూ ఏ బిల్లులను పెడుతున్నారన్నది ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. ఎటువంటి [more]

Update: 2020-01-20 02:40 GMT

ీమరికొద్దిసేపట్లో జరగబోయే మంత్రి వర్గ సమావేశంలోనే రాజధాని అమరావతి అంశంపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకూ ఏ బిల్లులను పెడుతున్నారన్నది ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. ఎటువంటి లీకులు బయటకు రానివ్వలేదు. జగన్ స్వయంగా దీనిపై సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో నిన్నంతా చర్చలు జరిపారు. చాలామంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఏ బిల్లులు వస్తున్నాయన్న విషయం తెలియదు. అయితే సీఆర్డీఏ చట్టం రద్దవుతుందని, దాని స్థానంలో అమరావతి డెవలెప్ మెంట్ అధారిటీ వస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఎటువంటి లీకులు రాకుండా ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంది. 9గంటలకు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలోనే ఎక్కువ మంది మంత్రులకు ఏ బిల్లులు వస్తాయో తెలుస్తుంది. రాజధాని అమరావతి అంశంపై మంత్రి వర్గ సమావేశంలోనే కీలక నిర‌్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News