సీఎం జగన్ ఇంటి వద్ద నిఘా…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు నిఘా పెంచారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘాను పెట్టారు. [more]

Update: 2019-07-04 04:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు నిఘా పెంచారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘాను పెట్టారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సందర్శకుల సంఖ్య సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకునే నేపథ్యంలో భద్రతను పోలీసులు మరింత పెంచారు. మావోయిస్టుల ప్రభావం కూడా ఉండటంతో సీఎం నివాస వద్ద నిరంతర పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వద్ద, తాడేపల్లికి చేరుకునే రహదారులపైన కూడా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News