చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి నిన్న ప్రమాణస్వీకారం చేసిన [more]

Update: 2019-05-31 06:16 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి నిన్న ప్రమాణస్వీకారం చేసిన వరకు పలువురు ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు జగన్ కు ట్విట్టర్ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరికి జగన్ ఇవాళ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత స్టాలిన్ జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేయగా వీరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News