పాదయాత్రలో చెప్పినట్లుగానే?

ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందిందచారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. [more]

Update: 2019-09-03 07:23 GMT

ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందిందచారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా పలాసలో 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 200 పడకల ఆసుపత్రికి పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పదివేల రూపాయల పింఛనును ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రి కోసం తక్షణం యాభై కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags:    

Similar News