విందు సమావేశాన్ని జగన్…?

అవినీతి తప్ప అన్ని అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విజయవాడ బెరం పార్కులో [more]

Update: 2019-12-18 02:09 GMT

అవినీతి తప్ప అన్ని అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విజయవాడ బెరం పార్కులో విందు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎమ్మల్యేలు, అధికారుల మధ్య సమన్వయానికి సూచనలు చేశారు. పాలు– నీళ్లలా కలిసి పనిచేయాలని కోరారు. అవినీతి తప్ప అన్ని అంశాల్లో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ముందుకుసాగాలన్నారు. ఇద్దరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలని, సఖ్యతతో ముందుకు సాగాలని కోరారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను….

ముమ్మరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని, ఇవి విజయవంతంగా ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారవర్గాలు దగ్గరగా పనిచేయాలన్నారు. అహంభావానికి అవకాశముండకూడదన్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలే అంతిమమమని చెప్పారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులు తోడుగా ఉంటారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తరుచుగా కలుసుకుని సమావేశాలు జరుపుకోవడంవల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు.

గ్రామ సచివాలయాలను…

జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, జనవరి నుంచి ఎమ్మల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో గమనించాలని కోరారు. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచమన్నామని, జాబితాలో పేరు లేకపోతే ఎవరికి, ఎలా దరఖాస్తు చేయాలో అందులో పొందుపరచమన్నామని తెలిపారు. ఓటు వేయని వారు కూడా అర్హుడైతే తప్పకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాలన్నారు. ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడాలన్నారు. దాదాపు 2 లక్షలమంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను ఎన్నుకుంటారని, ప్రజా సమస్యలపై వారు ఫోన్లు చేసినప్పుడు అధికారులు స్పందించాలన్నారు. వారు ప్రస్తావిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలని అధికారులను కోరారు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు రెస్పాన్స్‌ అనేది ఉండాలని, అలాగే ఎమ్మెల్యేలు కూడా అధికారులతో సఖ్యతగా సాగాలన్నారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ విడివిడిగా కూర్చుని చర్చించారు. జగన్ విందు సమావేశం సూపర్ సక్సెస్ అయిందని ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News