బ్రేకింగ్ : అక్కడకు వెళ్లి వచ్చిన తర్వాతే ఇక్కడకు రండి… జగన్ లేఖ

కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రులు జవదేకర్, గజేంద్ర షెకావత్ లకు [more]

Update: 2021-07-05 08:00 GMT

కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రులు జవదేకర్, గజేంద్ర షెకావత్ లకు జగన్ లేఖలు విడిగా రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన నీటి ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని సందర్శించేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ను ఆదేశించాలని జగన్ తన లేఖలో కేంద్రమంత్రులను కోరారు. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగు, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి విషయాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని జగన్ కోరారు. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను నియమించాలని జగన్ కోరారు.

Tags:    

Similar News