నిందితులను వదిలి బాధితులపైనే కేసులా..?

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై [more]

Update: 2019-04-16 06:48 GMT

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వైసీపీ నేతలపై దొంగ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల శివప్రసాదరావు డోర్ కి గడియ పెట్టుకున్నారని, తనంతట తానే చొక్కా చింపుకుంటే కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గురజాలలో టీడీపీకి ఓటు వేయలేదని ముస్లిం, దళితుల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినా కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై టీడీపీ వారు దాడి చేసినాకేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పుతలపట్టు అభ్యర్థి ఎం.ఎస్.బాబుకు టీడీపీ నేతల దాడిలో తలకు గాయమై కుట్లు పడి ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నా కేసు పెట్టలేదన్నారు. ఒకే కులానికి చెందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని, వారంతా చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి

నిందితులపై కేసులు పెట్టకుంటా అన్యాయంగా బాధితులపైనే కేసులు పెడుతున్న పరిస్థితి ఇవాళ ఏపీలో ఉందన్నారు. మచిలీపట్నంలో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలను తెరిచారన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. స్ట్రాంగ్ రూంల సీసీ కెమెరా ఫుటేజి నేరుగా ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేలా చూడాలని కోరారు. చంద్రబాబు చేసిన కుంభకోణాలకు సంబంధించి ఆధారాలు తుడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు బినామీలకు విచ్చలవిడిగా బిల్లులు ఇస్తున్నారని, వీటిని నియంత్రించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు.

Tags:    

Similar News