52 మంది విచారణ... 321 మంది స్టేట్ మెంట్లు

Update: 2018-11-02 10:31 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. అతడిని ఆరు రోజుల పాటు ప్రత్యేక ధర్యాప్తు బృందం విచారించింది. ఇప్పటి వరకు 52 మందిని సిట్ విచారించింది. శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ ఆధారంగా విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్, ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా విచారణ జరిపారు. నిందితుడు ఎక్కువ గా మాట్లాడిన 321 మందిని గుర్తించి వారి నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేశారు. ఇక లై డిటెక్టర్ పరీక్ష కోసం నిందితుడి అభిప్రాయాన్ని రికార్డు చేయనున్నారు. ఒకవేళ నిందితుడు ఇందుకు అంగీకరిస్తే లై డిటెక్టర్ పరీక్ష కోసం సిట్ కోర్టులో పిటీషన్ వేయనుంది. అయితే, సంఘటన జరిగిన రోజు జగన్ ధరించిన షర్టు ఇప్పించాలని కోరుతూ వేసిన పిటీషన్ తో పాటు ఫ్లెక్సీ, 11 పేజీల లేఖ పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లు ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం.

Similar News