ఇడుపుల పాయలో ఇద్దరూ వేర్వేరుగా…?

వైఎస్ జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేర్వేరుగా తన తండ్రి కి నివాళులర్పించడం విశేషం. ఎప్పుడూ [more]

Update: 2021-07-08 05:54 GMT

వైఎస్ జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేర్వేరుగా తన తండ్రి కి నివాళులర్పించడం విశేషం. ఎప్పుడూ కుటుంబ సభ్యులందరితో కలసి జగన్ ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించేవారు. అయితే ఈసారి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారు. జగన్ దానిని వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఈసారి ఇడుపులపాయకు వేర్వేరు సమయాల్లో రానున్నారు. ఈరోజు ఉదయమే వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వచ్చి నివాళులర్పించి హైదరాబాద్ వెళ్లారు. జగన్ మాత్రం అనంతపురం జిల్లాలోని రాయదుర్గం లోని పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం ఇడుపుల పాయకు చేరుకుని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. వైఎస్ షర్మిల వెంట విజయమ్మ ఉన్నారు. విజయమ్మ సాయంత్రం జగన్ తో పాటు కూడా నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది.

Tags:    

Similar News