కర్ణాటక శానససభ ఎన్నికల పోలింగ్ నుంచే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజ్యాంగ నిబంధలనకు విరుద్ధంగా యడ్యూరప్ప చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీ గడువుకోరినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. వారం రోజుల్లో బలాన్ని నిరూపించుకుంటామన్న బీజేపీ న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. రేపు సాయత్రం నాలుగు గంటలకు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కాంగ్రెస్ మాత్రం రేపు బలపరీక్ష నిర్వహించాలని కోరింది.