జగన్ చప్పరించేశారే...?

Update: 2018-06-15 14:00 GMT

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అడుగడుగునా జగన్ కి అపూర్వ ఆదరణ లభిస్తుంది. పేరవరం నుంచి రావులపాలెం వరకు జనం నీరాజనం పలికారు. ఆత్రేయపురం లో పూతరేకుల పరిశ్రమను, మామిడితాండ్రను పచ్చళ్ళ కుటీర పరిశ్రమలను పరిశీలించారు. వారి కష్టాలను, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం వస్తే వీటన్నిటిని పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. కుటుంబాలు గడిచేందుకు కుటీర పరిశ్రమగా ఇళ్లవద్ద చేసుకుంటున్న చిన్నపాటి వ్యాపారాలకు విద్యుత్ బిల్లులు కమర్షియల్ పరిధిలోకి తెచ్చి జీఎస్టీ కూడా విధిస్తు కమర్షియల్ టాక్స్ అధికారులతో వేధిస్తున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు. వారు తయారు చేస్తున్న పూతరేకులు, మామిడితాండ్ర తిని చాలా బాగున్నాయని కితాబునిచ్చారు.

జగన్ ని కలిసిన మత్సకారులు...

తమ సమస్యలను ప్రజా సంకల్ప యాత్రలో జగన్ కి నివేదించారు మత్సకారులు. వారు చెబుతున్న అంశాలను శ్రద్ధగా విన్నారు జగన్. మత్సకారులకు పెన్షన్లు అందించే కార్యక్రమం తీసుకుంటానని హామీనిచ్చారు జగన్. గంగపుత్రులు సమస్యలకు శాస్వీత పరిష్కారం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారి పిల్లలకు ఉన్నత చదువుల కోసం పూర్తి స్థాయి ఫీజు రీ ఎంబర్స్మెంట్ అమలు చేస్తామని వైద్యానికి సంబంధించి ప్రభుత్వమే అన్ని భరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News