జగన్ షేక్ చేసేశారే...!

Update: 2018-06-13 02:30 GMT

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరికి చేరుకుంది. ఊహించినట్లే జన సునామీ తో చారిత్రక వారధి రోడ్ కం రైలు వంతెన షేక్ అయ్యింది. అయితే సస్పెన్షన్ డిజైనింగ్ తో నిర్మించిన వారధి కావడంతో వారధిపై భారీ లోడ్ పడినప్పుడు, గూడ్స్ వంటి రైళ్లు వెళ్ళినప్పుడు వారధి షేక్ కావడం సాధారణ విషయమే. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఇసుకేస్తే రాలనంత జనం జగన్ వెంట నడిచారు. 15 ఏళ్ళ క్రితం ప్రజా ప్రస్థానం పేరుతో ప్రతిపక్షనేత హోదాలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే వారధిపై పాదయాత్ర చేపట్టారు. ఆయన రికార్డ్ ను అధిగమించే లా జనం జగన్ వెంట నడవటం విశేషం. జగన్ కు స్వాగతం పలుకుతూ వారధికి ఇరువైపులా రెయిలింగ్స్ అన్ని వైసిపి జెండాలతో నిండిపోతే బ్రిడ్జి కింది భాగంలో గోదావరి పై పడవలను కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు లంగరేసి మత్సకారుల తమ అభిమానం చాటుకున్నారు.

జగన్ కి దిష్టి తీసిన మహిళామణులు ...

రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ కూడా చారిత్రక ప్రాంతమే. ఆ ప్రాంతంలోని కూడళ్లు అన్నీ వేలాదిమందితో కిక్కిరిసి పోయాయి. పశ్చిమ నుంచి తూర్పు లో అడుగుపెట్టగానే 108 మంది మహిళలు భారీ గుమ్మడికాయలతో జగన్ కు దిష్టి తీసిన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. నాలుగు స్టేజ్ లపై ఒకరిపై ఒకరు నుంచున్న తీరులో దిష్టి కార్యక్రమానికి వైసిపి శ్రేణులు ప్రత్యేకంగా నిర్వహించడంతో జగన్ పులకించిపోయారు. వారధిపై యాత్ర మొదలై కోటిపల్లి బస్ సెంటర్ లో జగన్ సభ ముగిసే వరకు వెల్లువలా వచ్చి పడుతున్న జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ట్రాఫిక్ మొత్తాన్ని ఉదయం నుంచే దారిమళ్లించడంతో సామాన్య ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పాయి.

Similar News