జగన్ ఎంత మాట అన్నారు ...?

Update: 2018-05-20 03:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఎపి రాజకీయాలపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష నేత వైఎస్ జగన్ కు కర్ణాటకపై సుప్రీం ఇచ్చిన తీర్పు టిడిపిపై విమర్శల దాడి చేయడానికి ఆయుధం ఇచ్చినట్లు అయ్యింది. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకొని జగన్ ఇకపై కర్ణాటక రాజకీయాలను అక్కడ జరిగిన తతంగాన్ని పదేపదే ప్రస్తావించే అవకాశం వుంది. దానికి కారణం పక్క పార్టీ ఎమ్యెల్యేలను లాగి అధికారం హస్తగతం చేసుకుందామని ప్లాన్ చేసి పల్టీ కొట్టిన బిజెపి తీరును ఆయన అస్త్రం గా మలుచుకున్నారు. చంద్రబాబు అండ్ టీం కర్ణాటక రాజకీయాలపై చేస్తున్న ప్రకటనలను ఎద్దేవా చేస్తూ జనంలో జగన్ దాడి తీవ్రం చేశారు.

వైసిపి అధినేత ఏమంటున్నారంటే ...

"సంతలో పశువులను కొన్నట్లు వైసిపి వారిని కొనుగోలు చేసేశారు. సిగ్గులేకుండా ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్నారు. టిడిపి ఇక్కడ చేసింది ఏమిటి ? ఏపీలో వైసిపి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు తాయిలాలు ఎరవేసి లాగేశారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. అలాంటి టిడిపి ఇప్పుడు కర్ణాటకలో జరిగిన అనైతిక చర్యలకు పాల్పడిందంట్లు ఆరోపించడం హాస్యాస్పదం" అంటూ జగన్ విమర్శలు ఆరోపణలు పంచ్ డైలాగ్స్ తో కొట్టేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న జగన్ పర్యటన లో ఆయన తాజా రాజకీయాలపై చేస్తున్న ప్రసంగాలకు ప్రజలనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం విశేషం.

Similar News