బాబుపై బాంబు పేల్చిన జగన్ ...! (తుని సభలో)

Update: 2018-08-11 13:36 GMT

తునిలో తాగడానికి కూడా నీళ్లు లేవని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. తునిలో జరిగిన బహిరంగ సభలోఆయన మాట్లాడారు. నారాయణ స్కూల్స్ పేరిట దోచుకుతింటున్నారన్నారు. తునిలోరైలు తగులబెట్టింది చంద్రబాబేనని జగన్ ధ్వజమెత్తారు. చివరకు తునిలో డ్రైనేజీలను కూడా అధికార పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని చెప్పారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్ అని, దివీస్ కోసం పేద ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు. దివీస్ భూములు ఇవ్వలేదని రైతులపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే తుని రైలు దగ్దం కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. దేవుడు భూములను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారన్నారు. మఠాలను దోచుకునేందుకు కూడా కొందరు అధికార పార్టీ నేతలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. తుని బహిరంగ సభలకు విశేష స్పందన లభించింది.

Similar News