వైసీపీ చీఫ్ ఈరోజు....!

Update: 2018-06-17 02:30 GMT

తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేట నియోజకవర్గం నుంచి గన్నవరం నియోజకవర్గంవైపు జగన్ పాదయాత్ర సాగనుంది.191 రోజు ప్రజా సంకల్ప యాత్ర ను జగన్ ఆదివారం ప్రారంభిస్తారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చిత్తూరు లోను హోదా కోసం నిర్వహించిన బంద్ ల సందర్భంగా కూడా జగన్ తన యాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిబిఐ కోర్ట్ పనిచేసే క్రమంలో ప్రతి శుక్రవారం జగన్ న్యాయస్థానం ముందు హాజరు అవుతూ వస్తున్నారు. ఆ సమయంలోను వారానికి ఒక రోజు పాదయాత్ర కు బ్రేక్ పడి తరువాత రోజు నుంచి యాత్ర ఎక్కడ ఆగిందో అక్కడినుంచి యాధావిధిగా సాగుతుంది.

ఇది రూట్ మ్యాప్ ...

ఆదివారం జగన్ పర్యటించనున్న ప్రాంతాల రూట్ మ్యాప్ ను వైసిపి నేతలు విడుదల చేశారు. కొత్తపేట నియోజకవర్గం వెంకటేశ్వర పురం నుంచి పాదయాత్రను జగన్ ప్రారంభిస్తారు. అనంతరం వెదిరేశ్వరపురం, కేతిరాజుపల్లి, దేవరపల్లి మీదుగా ఎత్తుకోట చేరుకుంటారు. అక్కడినుంచి పలివెలక్రాస్ రోడ్డు మీదుగా గంటిపాలెంక్రాస్ నుంచి గంటి వరకు వైసిపి చీఫ్ యాత్ర సాగనుంది. జగన్ టూర్ కోనసీమలోని గన్నవరం నియోజకవర్గ పరిధిలో విజయవంతం చేసేందుకు వైసిపి కో ఆర్డినేటర్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం విశేషం.

Similar News