వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర జనంలో మమేకమై సాగిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో హీట్ వేవ్స్ 40 డిగ్రీలు దాటి పోతున్నా కోనసీమ పల్లెల్లో జగన్ ను చూసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు ప్రజలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర వెంకటేశ్వరపురం నుంచి బయల్దేరి వెదిరేశ్వరపురం, కేతిరాజుపల్లి, దేవరపల్లి మీదుగా ఈతకోట చేరుకున్నారు. దారిపొడుగునా జగన్ కు జనం నీరాజనాలు పలికారు. పాదయాత్రలో అరటిరైతులు తమకష్టాలను ప్రతిపక్ష నేతకు వివరించారు. అరటిరైతులకు గిట్టుబాట ధరలేదని వాపోయారు. తప్పకుండా వారికి న్యాయం చేస్తా అని జగన్ హామీనిచ్చారు.
ఆటో డ్రైవర్ గా జగన్ ...
అసంఘటిత రంగంలో వున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీనిచ్చారు జగన్. ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి వైసిపి అభిమానులను ఆటోవాలాలను అలరించారు జగన్. కొద్ది దూరం ఆటో నడిపి వారి వృత్తికి సంఘీభావం తెలిపారు జగన్. వైసిపి చీఫ్ పాదయాత్రలో సెల్ఫీ ల జోరు బాగా సాగుతుంది. యువత జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడుతుంది. సెల్ఫీలు సరిగ్గా తీసుకోలేకపోతున్న వారికి జగన్ సహకారం అందించి ఉత్సహంగా ప్రోత్సహిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎండవేడిమి అధికంగా వున్నా జగన్ ను చూసేందుకు వచ్చేవారు వెనక్కి తగ్గకపోవడం విశేషం.