'యార్లగడ్డ' ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మనసు మార్చుకున్నారా?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గపడుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంది. కొందరు పార్టీ మారుతుంటే మరి కొందరికి..

Update: 2023-08-21 05:10 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గపడుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంది. కొందరు పార్టీ మారుతుంటే మరి కొందరికి టికెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించడానికి ముందు ఆత్మీయ సమావేశం పేరిట బలనిరూపణకు దిగినయార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలోనే రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్య అనుచరులతో సమావేశమై వైసీపీని మారుతున్నట్లు ప్రకటించారు. నారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్‌ వెళ్లి చంద్రబాబును కలిసి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ సీపీలో ఆరు సంవత్సరాలు కష్ట పడ్డానని, అయినా పార్టీలో తనకు గుర్తింపు లభించలేదని చెప్పారు. అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. అయితే టీడీపీలో చేరినా గన్నవరం నుంచి మాత్రం పోటీ చేస్తానని చెప్పలేదు. తన సీటు విషయంలో అధినేత చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ చెబుతున్నారు.

ఇక చంద్రబాబుతో భేటీ తర్వాత యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గన్నవరం ప్రజలను వీడేది లేదు, 2024లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చాన యార్ల గడ్డ సొంత ప్రాంతం కాకపోయినా తనను ఇంతలా ఆదరిస్తున్న గన్నవరం ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి చంద్రబాబుతో భేటీ తర్వాత యార్లగడ్డ మాత్రం గన్నవరం నుంచి పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు. చంద్రబాబు సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవంతోనే యార్లగడ్డ చెప్పలేదని తెలుస్తుంది.

తెరపైకి గుడివాడ పేరు

అంతేకాకుండా కొత్తగా గుడివాడ పేరును తెరపైకి తెచ్చారు. గన్నవరంలో వల్లభనేని వంశీతోపాటు గుడివాడలో కొడాలి నానిని ఎలాగైన ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే చంద్రబాబుతో భేటీలో గుడివాడ ప్రస్తావన వచ్చి ఉండవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి గన్నవరం, గుడివాడ నియజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరు. గుడివాడలో సీటు కోసం రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. ఇక గన్నవరం స్థానంలో పోటీ కూడా లేదు. ఈ రెండు స్థానాల్లో యార్లగడ్డ బలం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత సీటుపై హామీ ఇస్తానన్నారా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. అయితే యార్లగడ్డకు గర్నవరం టికెట్‌ ఇస్తే అక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుందనే చెప్పాలి. 


Tags:    

Similar News