కాస్తాగండి... పీఓకే భారత్‌లో కలిసిపోతుంది

‘కాస్తాగండి..! పీఓకే (పాకిస్తాన్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌) భారత్‌లో కలిసిపోతుంది’ ఇవేవో ఓ సామాన్యుడు అన్న మాటలు కాదు. సాక్షాత్తూ కేంద్రమంతి, ఒకప్పటి ఆర్మీ జనరల్‌ వీకే సింగ్‌ ధీమా ఇది. ‘కొన్నాళ్లలో పీఓకే భారతదేశంలో సహజంగానే కలిసిపోతుంది అంటూ రహదారి రవాణా, జాతీయ రహదారుల సహాయ మంత్రి వీకే సింగ్‌ వ్యాఖ్యానించారు.

Update: 2023-09-12 03:46 GMT

కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ధీమా!

‘కాస్తాగండి..! పీఓకే (పాకిస్తాన్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌) భారత్‌లో కలిసిపోతుంది’ ఇవేవో ఓ సామాన్యుడు అన్న మాటలు కాదు. సాక్షాత్తూ కేంద్రమంతి, ఒకప్పటి ఆర్మీ జనరల్‌ వీకే సింగ్‌ ధీమా ఇది. ‘కొన్నాళ్లలో పీఓకే భారతదేశంలో సహజంగానే కలిసిపోతుంది అంటూ రహదారి రవాణా, జాతీయ రహదారుల సహాయ మంత్రి వీకే సింగ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌తో రహదారి మార్గాన్ని తెరవాలని పీఓకే లో ఉన్న షియా ముస్లింలు కోరడంపై వీకే సింగ్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఓ బహిరంగ సభలో సోమవారం వీకే సింగ్‌ పాల్గొన్నారు. అయితే పీఓకే భారత్‌లో ఎలా కలిసిపోతుంది అనే విషయంపై ఆయన ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. జీ`20 సదస్సు విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అయిన శశి థరూర్‌ లాంటి వాళ్లు కూడా జీ`20 విజయవంతంపై బీజేపీని ప్రశంసించారని ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజస్తాన్‌లో భాజపా ఘనవిజయం సాధిస్తుందని సింగ్‌ పేర్కొన్నారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ‘మోదీ చరిష్మా మీదే ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ కోసం సిన్సియర్‌గా కష్టపడే వ్యక్తులకు బీజేపీ ఎప్పుడూ అవకాశాలు ఇస్తుంది’ అని సమాధానమిచ్చారు.

Tags:    

Similar News