వాజ్ పేయిని చూసిన అద్వానీ...!

Update: 2018-06-12 06:02 GMT

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని పలువురు పరామర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్ననే ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషి, రాజ్ నాధ్ సింగ్ లు ఎయిమ్స్ కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వాజపేయి సోమవారం చేరిన సంగతి తెలిసిందే.

కోలుకుంటున్నారన్న.....

అయితే ఎయిమ్స్ వాజ్ పేయి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వాజ్ పేయిని అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆయనకు మూత్రనాళం, ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గత ముప్ఫయి ఏళ్లుగా వాజ్ పేయికివైద్యాన్ని అందిస్తున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని బృందం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తుందని, త్వరగానే కోలుకుంటారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా వాజపేయిని చూసి బీజేపీ సీనియర్ నేత ఎల్ .కె. అద్వానీ కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. వాజ్ పేయిని చూడగానే అద్వానీ కొంత ఉద్విగ్నతకు గురయ్యారు.

Similar News