హెచ్-1బీ వీసా ఫీజు భారీగా పెంచేసిన ట్రంప్‌.. ఇకపై అమెరికాలో అడుగుపెట్టడం ఎంత‌ క‌ష్ట‌మో చూడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలో భారీ మార్పులు చేసి ఫీజులను పెంచారు

Update: 2025-09-20 05:08 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలో భారీ మార్పులు చేసి ఫీజులను పెంచారు. అమెరికా H-1B వీసా పొందడాని ప్రజలు ఇప్పుడు $ 100,000 (దాదాపు రూ. 90 లక్షలు) చెల్లించాలి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది భారతీయుల సమస్యలను కూడా పెంచే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం అమెరికాకు మంచి నైపుణ్యం ఉన్నవారే వచ్చేలా చూస్తామని.. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాకు మంచి కార్మికులు కావాలి. కొత్త నిబంధనలు అత్యుత్తమ కార్మికులు మాత్రమే అమెరికాకు రావాలని నిర్ధారిస్తుందన్నారు.

అమెరికాలోప్రవేశించాలంటే H-1B వీసా పొందాలి. ఈ వీసా సహాయంతో వేలాది మంది భారతీయులు అమెరికాకు వెళుతున్నారు. దీని ఖర్చులను అమెరికన్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ రంగంలోని కంపెనీలు భరిస్తున్నాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం.. పెద్ద కంపెనీలు విదేశీయులకు శిక్షణ ఇవ్వడం మానేయాలన్నదే ట్రంప్ నిర్ణయం. క‌పెనీలు ఇలా చేస్తే అమెరికా ప్రభుత్వానికి 1 లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల కంపెనీలు శిక్షణ ఇవ్వాల‌నుకుంటే అమెరికన్ విశ్వవిద్యాలయాల నుండి చదువు పూర్తి చేసిన అమెరికన్ పౌరులు, యువతకు శిక్షణ ఇవ్వండి.

ప్రస్తుతం H-1B వీసా కోసం రిజిస్ట్రేషన్ ఫీజు $215 (సుమారు రూ. 1900). అదే సమయంలో ఫారం 129 కోసం వ్యక్తుల నుండి $780 (సుమారు రూ. 68,000) వసూలు చేస్తారు. ఇటీవల అమెరికన్ ఎంపీ జిమ్ బ్యాంక్స్ పార్లమెంట్‌లో అమెరికన్ టెక్ వర్క్‌ఫోర్స్ చట్టం పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. దీనిలో H-1B వీసా రుసుమును 60 వేల నుండి 1.5 లక్షల డాలర్లకు పెంచాలని డిమాండ్ వచ్చింది.

హెచ్-1బీ వీసా కింద భారతీయులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాలో హెచ్‌-1బీ వీసా తీసుకునేవారిలో 71 శాతం మంది భారతీయులే. అదే సమయంలో చిలీ 11.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. జూన్ 2025 నాటికి, Amazon 12,000 H-1B వీసాలను ఆమోదించింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్, మెటా దాదాపు 5,000 H-1B వీసాలను ఆమోదించాయి.

2020 మరియు 2023 మధ్య మొత్తం హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులు పొందారు. అయితే, ఇప్పుడు వీసా ఫీజుల పెంపు కారణంగా భారతీయులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారే అవ‌కాశం ఉంది.

ఇతర దేశాల నుంచి అమెరికాకు పని చేసేందుకు వచ్చే వారికి H-1B వీసా అందుబాటులో ఉంటుంది. ఈ వీసా 6 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. హెచ్-1బీ వీసా పొందిన వ్యక్తులు తమతో పాటు భార్య, పిల్లలను కూడా అమెరికాకు తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా.. వారు అమెరికన్ పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News