పాక్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భారత్ తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత పర్యటన తనకు ఎంతో [more]

Update: 2020-02-25 12:48 GMT

భారత్ తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత పర్యటన తనకు ఎంతో ఆనందం కల్గించిందన్నారు. ఇక్కడ అద్భుతమైన ాతిధ్యం లభిందన్నారు. భారత్ తో రక్షణ ఒప్పందం కుదిరిందన్నారు. ఇంధన రంగంలో తమ పెట్టుబడులు పెరిగాయని ట్రంప్ తెలిపారు. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తమకు భారత్ చాలా పెద్ద మార్కెట్ అని, మరిన్ని ఆయుధాలను విక్రయిస్తామని ట్రంప్ తెలిపారు. మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుందని చెప్పారు. త్వరలో ఆప్ఫాన్ ఒప్పందం ఉంటుందన్నారు. హింసకు అమెరికా దూరమని ట్రంప్ తెలిపారు. తాలిబాన్లతో చర్చలు సరైన దిశలో నడిచాయన్నారు. సిరియాను బాగ్దాదీ నుంచి వముక్తి చేశామన్నారు. మోదీకి మతస్వేచ్ఛను కాపాడాలని చెప్పానని చెప్పారు. సీఏఏ పైన అయితే మోదీతో తాను చర్చలు జరపలేదన్నారు. మత స్వేచ్ఛపై లోతుగా మోదీతో చర్చించానని ట్రంప్ తెలిపారు. భారత్ లో అన్ని మతాలను సమానంగా చూస్తున్నారన్నారు. మోదీ మాటలపై తనకు నమ్మకం ఉందన్నారు.

పాక్ తో సంబంధాలపై….

మోదీతో హెచ్ 1 బీ వీసాల గురించి కూడా చర్చించానన్నారు. భారత పౌరులను అమెరికా తగిన విధంగా గౌరవిస్తుందని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కూడా ట్రంప్ స్పందించారు. అది భారత్ అంతర్గత వ్యవహారమని చెప్పారు. పాక్ విషయంలోనూ మోదీతో చర్చించానన్నారు. పాకిస్థాన్ లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. పాకిస్థాన్ అరాచక శక్తులను నియంత్రిస్తున్నామని చెప్పారు. అవసరమైతే పాక్, భారత్ ల మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పారు. పాక్ ప్రధానితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. రెండు దేశాలూ కోరితేనే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాశ్మీర్ అంశంపై రెండు పక్షాల వాదనలను వినాలన్నారు. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర అంశమే కారణమని, రెండు దేశాలు పరస్పరం కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా వవస్తులపై భారత్ అధిక సుంకం విధిస్తుందని, వాణిజ్య ఒప్పందాలపై భారత్ ఒత్తిళ్లకు తలొగ్గనని తెలిపారు. అధిక సుంకాలను అమెరికా ఎట్టిపరిస్థితుల్లో భరించదన్నారు.

Tags:    

Similar News