ట్రాఫిక్ చిక్కుల్లో ఐటీ కారిడార్

ఐటీ కారిడార్ కు మళ్లీ ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు . ఐటీ కారిడార్ కు వెళ్లే ప్రధాన రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం లో అపశృతి [more]

Update: 2019-07-02 06:29 GMT

ఐటీ కారిడార్ కు మళ్లీ ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు . ఐటీ కారిడార్ కు వెళ్లే ప్రధాన రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం లో అపశృతి దొర్లింది . ఇవాళ ఉదయం ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం వాడుతున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ..ఈ సమయంలో రోడ్డుపైన వాహనదారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్రేన్ కులిపోతున్న విషయాన్ని గమనించి కిందికి దూకే ప్రయత్నం చేసిన డ్రైవర్ గురుప్రీత్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్రేన్ ఆపరేటర్ పరిస్థితి విషమంగా ఉంది . ఐటి ఏరియాకు కనెక్టువిటీని పెంచుతూ ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తుంది. టోలిచౌకి చౌరస్తా నుంచి గచ్చిబౌలి వరకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది .గత కొంతకాలం నుంచి ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి .అయితే ఇక్కడ నిర్మాణం కోసం భారీ క్రేన్ ను ఉపయోగించారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ భారీ క్రేన్ వాడుతున్నారు . ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఈ భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ..దీంతో మెహదీపట్నం నానా నగర్ టోలి చౌకి మీదుగా గచ్చిబౌలి వెళ్లే వాహనాలను మొత్తం కూడా అధికారులు మళ్లించారు.. ఈ రోడ్డు నుంచి వాహనాలు ప్రయాణం చేయవద్దని సూచించారు.

Tags:    

Similar News