సెక్స్ రాకెట్...మరో డ్రగ్స్ కేసేనా..?

Update: 2018-06-20 08:18 GMT

ఈ మధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని విషయాలు తెగ కుదిపేస్తున్నాయి. గత ఆగస్ట్ లో టాలీవుడ్ ని డ్రగ్ రాకెట్ అతలాకులం చేస్తే... ఈ ఏడాది మొదట్లో శ్రీ రెడ్డి కి 'మా' కి మధ్య జరిగిన గొడవ... క్యాష్టింగ్ కౌచ్ ఇలా అనేకానేక విషయాలు ఛానల్స్ అన్ని కలిసి రచ్చరచ్చ చేశాయి. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన కత్తి మహేష్ కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పెట్టుకుని ఛానల్స్ కెక్కి రచ్చ చేసాడు. ఇక తాజా గా టాలీవుడ్ ని అమెరికాలో సెక్స్ రాకెట్ అనే టైటిల్ కుదిపేస్తోంది. కేవలం టాలీవుడ్ నే కాదు ఈ అమెరికా సెక్స్ రాకెట్ అనేక భాషల ఇండస్ట్రీలను ఒక కుదుపు కుదుపుతుంది. తాజాగా బయటికొచ్చిన అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంలో కిషన్ మోదుగుముడి అరెస్ట్ అవడం, అతని కాల్ లిస్ట్ బయటికి రావడం... అందులో అనేక సంచలన విషయాలు వెలుగుకి రావడం.. ఇక తాజాగా ఛానల్స్ అన్ని ఈ అమెరికా సెక్స్ రాకెట్ మీద డిబేట్స్ నిర్వహించడం. ఇలా టాలీవుడ్ పరువు గంగలో కలిసిపోయింది.

తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు

అయితే ప్రస్తుతం అమెరికా పోలీసులు, మా అసోసిషియన్ అమెరికా సెక్స్ రాకెట్ విషయాన్నీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అమెరికాకి వెళ్లే సెలబ్రిటీస్ ని అమెరికా పోలీసులు సోదాలు, ప్రశ్నలతో చంపేస్తున్నారు. అలాగే ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన హీరోయిన్, టివి ఆర్టిస్ట్ లను, అరెస్ట్ చెయ్యడానికి.. వారిని ప్రశ్నించడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇలా పోలీసులు అరెస్ట్ లు, ప్రశ్నలు అంటూ కాలం గడపడమే తప్ప.. నిజాలు మాత్రం బయటకు రావనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు అమెరికాలో సెక్స్ రాకెట్ లో భాగమైన హీరోయిన్స్ ఎవరెనేది ఎవ్వరికి క్లారిటీ లేదు కానీ... సోషల్ మీడియాలో పేరున్న సెలెబ్రిటీల పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇక కొంతమంది అమెరికా సెక్స్ రాకెట్ నిజమే అంటూ కొందరు అగ్ర యాంకర్లు, నటీమణులు బయటికొస్తున్నారు. అందులో కొంతమంది మేం తెలివిగా మొదట్లోనే తప్పించుకున్నామని చెబుతున్నారు.

నీరుగార్చేందుకు ప్రయత్నాలు..?

ప్రస్తుతం హాట్ హాట్ గా మారిన అమెరికా సెక్స్ రాకెట్ విషయం కూడా త్వరలోనే మరుగున పడిపోతుందంటున్నారు. గత ఏడాది టాలీవుడ్ ని షేక్ చేసిన డ్రగ్స్ రాకెట్ కూడా మూడు నెలలు హాట్ హాట్ గా సాగింది. కొందరు హీరో, హీరోయిన్లని ప్రశ్నించిన అధికారులు... వారి రక్త నమూనాలను సేకరించి వాటిలో డ్రగ్స్ మిక్స్ అయితే అరెస్ట్ లంటూ లీకులిచ్చి.. ఆకేసును గాలికొదిలేశారు. మరి తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ విషయంలోనూ ఇదే జరుగుతుందని.. డ్రగ్స్ కేసు నీరు కారిపోవడం వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందని.. ఇప్పుడు కూడా అదే పెద్దలు అమెరికా సెక్స్ రాకెట్ విషయాన్నీ మరుగున పడేయగలరనే అంటున్నారు.

Similar News