Breaking : సీనియర్ నటి జమున మృతి

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున మరణించారు

Update: 2023-01-27 03:32 GMT

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున మరణించారు. 86 ఏళ్ల జమున హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులతో పనిచేసిన జమున 1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. సినీ రంగం నుంచే కాకుండా రాజకీయంగా కూడా రాణించారు. 1989 లో  రాజమండ్రి నుంచి జమున ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 198 సినిమాల్లో జమున నటించారు.

సత్యభామగా...
జమున సత్యభామగా మంచి పేరు తెచ్చుకున్నారు. సత్యభామగా ఆమె నటించిన పౌరాణిక చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. 1953 పుట్టిల్లుతో జమున టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. కర్ణాటకలోని హంపిలో జన్మించిన జమున ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో పెరిగారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ముఖ్య కథాయికగా ఎదిగారు. అప్పటి నుంచి జమున వెనుదిరిగి చూడలేదు. జమున మృతితో టాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఉదయం 11 గంటలకు జమున పార్ధీవ దేహాన్ని ఫిలింఛాంబర్ కు తీసుకువస్తారు. ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలుస్తోంది.


Tags:    

Similar News