హమ్మయ్య.. బయటపడ్డారు

Update: 2018-07-10 12:15 GMT

థాయ్ ల్యాండ్ గుహల్లో 17 రోజులుగా చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు, ఫుట్ బాల్ కోచ్ ఎట్టకేలకు బయటపడ్డారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు 3 రోజులుగా తీవ్రంగా ప్రయ్నత్నిస్తున్న రెస్య్కూ బృందం ఎట్టకేలకు ఆపరేషన్ ను విజయవంతం చేసింది. ఫుట్ బాల్ జట్టుగా ఉన్న 12 మంది చిన్నారులు, ఓ కోచ్ గుహలు చూడటానికి వెళ్లి అందులో చుక్కుపోయారు. గుహల్లోకి చిన్నారులు సుమారు రెండున్నర మైళ్ల దూరం వెళ్లగా భారీ వర్షాలు కురవడం, గుహలు మొత్తం నీటితో నిండిపోవడంతో వారు తిరిగి రాలేకపోయారు.

ప్రాణాలను పణంగా పెట్టి

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో చిన్నారులను కాపాడేందుకు థాయ్ ల్యాండ్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. చిన్నారులు ఎక్కడనున్నారో గుర్తించి, ప్రపంచంలోనే టాప్ స్కూబా డైవర్లను తీసుకువచ్చి గుహల్లోకి పంపించింది. మొత్తం 90 మంది రెస్క్యూ టీం సభ్యులు ఈ ఆపరేషన్ లో పాల్గొనగా, ఇద్దరు స్కూబా డైవర్లు మాత్రమే లోపలికి వెళ్లగలిగారు. మొత్తం వరద నీరు, బురదతో నిండిన ఈ గుహల్లోకి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ లోనికి వెళ్లి ఒక్కో చిన్నారికి ఆక్సిజన్ అమర్చి బయటకు తీసుకువచ్చారు. 8వ తేదీన నలుగురిని, నిన్న నలుగురిని బయటకు తీసుకురాగా, ఇవాళ మిగతా వారిని కూడా రక్షించారు. ఈ క్రమంలో ఒక రెస్య్కూ టీం సభ్యుడు ప్రాణాలను కోల్పోయాడు.

Similar News