Hot Summer: ఈ నెల 12 నుంచి హై అలెర్ట్... ఎండలు ఎన్ని డిగ్రీలు ఉంటాయో తెలుసా?

గరిష్ట ఉష్ణోగ్రతలు జారీ కావడంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది

Update: 2025-03-12 04:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు జారీ కావడంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఎండల తీవ్రత మరింంత ఎక్కువ కానుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. ప్రస్తుతం కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు చేరుకున్నాయని తెలిపిన వాతావరణ శాఖ మిగిలిన ప్రాంతాల్లోనూ 36 డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. భానుడి ప్రతాపంతో మరింత ఎండలు ముదిరే అవకాశముందన్నారు.

ఈ జిల్లాల్లో జాగ్రత్త...
హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల కొన్ని జిల్లాలు మినహాయిస్తే తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో ప్రజలు వీలయినంత వరకూ ఇంటి నుంచిబయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా రహదారులపై ప్రయాణించే వారు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని నిపుణులు తెలిపారు. టైర్లు పంక్చర్ అయ్యే అవకాశమున్నందున అతి వేగం పనికిరాదని, రహదారుల శాఖ సూచన మేరకు స్పీడ్ కంట్రోల్ లో వెళ్లాలని సూచించింది. తారు రోడ్డు కావడంతో ఎండల తీవ్రతకు టైర్లు పగిలిపోయి ప్రమాదానికి గురయ్యే అవకాశముందని మెకానిక్ లు కూడా హెచ్చరిస్తున్నారు.
వడగాలులు ఇక్కడ...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు ప్రాతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల చివర వరకూ తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వడగాలులు ఎక్కువగా 62 మండలాల్లో వీస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా-11, విజయనగరం-16, పార్వతీపురంమన్యం-10, అల్లూరి సీతారామరాజు -10, అనకాపల్లి-2, కాకినాడ-1, కోనసీమ-1, తూర్పుగోదావరి-8, ఏలూరు-3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా రోజుకు నాలుగులీటర్ల మంచినీరు తీసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News