జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ మాటలదాడిని ప్రారంభించింది. పవన్ వి ఉత్త గాలి మాటలేనని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారన్నారు. టీటీడీ విషయంలోనూ పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేఈ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్ కలిసి పోటీ చేస్తారా? అన్నదానిపై ఇప్పుడే చెప్పలేమన్నారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే పవన్ విమర్శలు చేస్తున్నారన్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా ఫైర్ అయ్యారు. పొత్తులపై పవన్ స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. జగన్, పవన్ కలసి పోటీ చేసినా తమకు వచ్చే ఇబ్బంది లేదన్నారు. అభివృద్ధికి సహకిరిస్తారా? అరాచకం వెన్నంటి ఉంటారో పవన్ తేల్చుకోవాలని బోండా ఉమా నిలదీశారు. అ జగన్ పాదయాత్రకు స్పందన రావడం లేదని వైసీపీ పవన్ తో జతకట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు బోండా ఉమ.లాగే వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.