టీవీ సీరియల్స్ మళ్లీ నిలిపివేత… సీరియల్ నటుడికి?

తెలుగు టీవీ సీరియల్స్ ను మళ్లీ నిలిపివేశారు. తెలుగు టీవీ సీరియల్ ప్రముఖ నటుడికి నిన్న కరోనా వైరస్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే షూటింగ్ [more]

Update: 2020-06-24 07:43 GMT

తెలుగు టీవీ సీరియల్స్ ను మళ్లీ నిలిపివేశారు. తెలుగు టీవీ సీరియల్ ప్రముఖ నటుడికి నిన్న కరోనా వైరస్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే షూటింగ్ నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతిచ్చింది. షూటింగ్ లు ప్రారంభమైన వారం తిరక్క ముందే ఒక నటుడికి కరోనా సోకింది. దీంతో ఆ షూటింగ్ లో పాల్గొన్న వారిందరినీ క్వారంటైన్ కు పంపారు. కరోనా నిబంధనలు పాటించడం లేదని , అందుకే కరోనా వైరస్ వ్యాపించిందని పరిశ్రమ వర్గాలు కూడా అభిప్రాయపడుతన్నాయి. ఒకరు చేసిన తప్పుకు అందరూ శిక్ష అనుభవించాల్సి వస్తుందని మిగిలిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News