ఆంధ్రలో కూడా ఉచిత కరెంట్‌!

కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత కరెంట్‌ నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత కరెంట్‌ను ఇచ్చే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. త్వరలో జనసేనతో కలిసి విడుదల చేయబోయే తన మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు సమాచారం. రెండు వందల యూనిట్ల లోపు కరెంట్‌ వాడే ఇళ్లు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. ఇదే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కీలకమైన హామీ కానుంది.

Update: 2023-12-08 02:59 GMT

కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో... ఉచిత కరెంట్‌ నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత కరెంట్‌ను ఇచ్చే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. త్వరలో జనసేనతో కలిసి విడుదల చేయబోయే తన మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు సమాచారం. రెండు వందల యూనిట్ల లోపు కరెంట్‌ వాడే ఇళ్లు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చెల్లించక్కర్లేదు. ఇదే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కీలకమైన హామీ కానుంది.

కర్నాటకలో ఉచిత విద్యుత్‌ హామీని ఇవ్వడమే కాకుండా దానిని అమలు కూడా చేస్తున్నారు. అదే ధైర్యంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ఈ హామీని ఇచ్చింది. వీటితో పాటు ఇచ్చిన ఆరు హామీల దిశగా చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ నూతన ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడిరచారు. తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపుతో, ఏపీలో కూడా ఉచిత విద్యుత్‌ బ్రహ్మాస్త్రాన్ని తెలుగుదేశం సంధించనుంది. కాంగ్రెస్‌ కూడా తెలంగాణ లో ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హాదా, సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి వంటివి కూడా ప్రస్తావించనుంది.

ఫ్రీ కరెంట్‌తో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తెలుపు రేషన్‌ కార్డు ఉన్న మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతీ నెలా నగదు జమ లాంటి హామీలు కూడా తెలుగుదేశం మ్యానిఫెస్టోలో చోటు చేసుకుంటాయి. వీటిని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశానికి అత్యంత అవసరం. తన పార్టీని కాపాడుకోడానికి ఇదే దాదాపు చివరి అవకాశం. ఇప్పుడు కనుక ఓడిపోతే, సైకిల్‌ను అమాంతం కబళించడానికి భాజపా సిద్ధంగా ఉంది. అందుకే తెలుగుదేశం మ్యానిఫెస్టోలో చాలా హామీలు ఉంటాయి. ఈ హామీలకు అధికార వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆంధ్రలో రాబోయేది హామీల కాలం. త్వరలోనే ఇంటికి మూడుపూటలా భోజనం సరఫరా, అన్నం కలిపి నోట్లో ముద్దలు పెడతాం లాంటి హామీలు (క)వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News