ఆ రెండు కాలేజీలే?

తెలంగాణ ఎంసెట్ స్కాం కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రముఖ [more]

Update: 2020-01-31 02:33 GMT

తెలంగాణ ఎంసెట్ స్కాం కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రముఖ కాలేజీలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కాలేజీ లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు పేపర్ లీకేజీ లో కీలక పాత్ర పోషించారని చార్జిషీట్లో పేర్కొన్నారు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఎంసెట్ పేపర్ లీకేజీ లో సూత్రధారులు గా ఉన్నారని సిఐడి వేసిన చార్జిషీట్ లో పేర్కొంది.

దొడ్డిదారిన పేపర్….

2016 లో జరిగిన ఎం సెట్ స్కాం లో సిఐడి దర్యాప్తు పూర్తి చేసినాంపల్లి కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది . నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో చార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది నిందితులను చేర్చింది. ఇందులో ముగ్గురు నిందితులు చనిపోయారు. ఒకరు అనుమానాస్పదస్థితిలో చనిపోగా మరో ఇద్దరు సహజ మరణం పొందారు. కమలేష్, జితేందర్, రావత్ ముగ్గురు నిందితులు చనిపోయారు. 64 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు సిఐడి తరలించింది. ఈ కేసులో ఇంకా 23 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు గా సిఐడి పేర్కొంది. ర్యాంకుల కోసం నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ దొడ్డిదారిన పేపర్ తీసుకుని వచ్చారని పేర్కొంది. ఎంసెట్ స్కాం లో నారాయణ, చైతన్య కళాలశాలకు చెందిన వారి పాత్ర ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు వెల్లడించారు. నారాయణ , చైతన్య కళాశాలలకు చెందిన 9 మంది సిబ్బందిని కూడా సిఐడి ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే నాంపల్లి కోర్టు ట్రయల్స్ ను ప్రారంభిస్తుంది.

Tags:    

Similar News