క్లారిటీ ఇచ్చారు కానీ?

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆర్టీసీ ప్రయివేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తుది నిర్ణయం వెలువరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్ష [more]

Update: 2019-11-22 01:53 GMT

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆర్టీసీ ప్రయివేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తుది నిర్ణయం వెలువరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఒక విషయంలో మాత్రం స్పష్టత ఇచ్చారు. ఆర్టీసీని ఇప్పుడున్న పరిస్థితుల్లో నడపలేమని భావిస్తున్నారు. ప్రతి నెల 640 కోట్ల రూపాయల భారాన్ని మోయాలంటే ప్రస్తుతమున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులను కేసీఆర్ కోరారు. ఆర్టీసీకి ఇప్పటికే ఐదువేల కోట్ల అప్పులున్నాయని, రెండు నెలల జీతాలు కార్మికులకు చెల్లించాలన్నా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఛార్జీలు పెంచాలన్నా ప్రజలపై భారం మోపడం ఇష్టంలేదన్నారు కేసీఆర్. అయితే కార్మికులు మొండిగా వ్యవహరిస్తే తాము ఏమీ చేయలేమని కూడా కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆర్టీసీ ఇప్పుడున్న రీతిలో ఉండదని మాత్రం కేసీఆర్ సమీక్షలో తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే ఏమేం షరతులు పెడతారు? కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటే తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం ఈరోజు స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News