అందరికీ టిక్కెట్లు.. ఆ ఒక్కరికి తప్ప

రెండేళ్లకు ముందుగానే చంద్రబాబు 17 మందికి చంద్రబాబు టిక్కెట్లు కన్ఫర్మ్ చేశారు.

Update: 2022-09-16 02:20 GMT

రెండేళ్లకు ముందుగానే చంద్రబాబు 17 మందికి చంద్రబాబు టిక్కెట్లు కన్ఫర్మ్ చేశారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరికీ టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు. ఒకే ఒక్కరికి మాత్రం చంద్రబాబు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావుకు మాత్రం టిక్కెట్ పై ఏ విషయమూ స్పష్టత ఇవ్వలేదు. మిగిలిన అందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

గంటా దూరంగా...
చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఆయన తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లు వైసీపీ మద్దతుదారులగా మారారు. మిగిలిన వారంతా పార్టీలోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిన్న జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కూడా అధికార పార్టీతో వారు వీరోచితంగా పోరాడాని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గంటాకు మాత్రం...
నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకు గంటా శ్రీనవాసరావు రాలేదు. బాలకృష్ణ కూడా గైర్హాజరయ్యారు. చంద్రబాబును మినహాయిస్తే మిగిలిన 16 మందిని అధికార పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కొంత ఉద్వేగానికి గురయ్యారని తెలిసింది. టీడీపీ తరుపున పోరాడుతున్న వారికి తిరిగి టిక్కెట్లు ఇస్తున్నానని ప్రకటించారు. 1994లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇచ్చామని, ఈసారి కూడా అందరికీ ఇస్తున్నట్లు ఆయన శాసనసభ పక్ష సమావేశంలో ప్రకటించడం విశేషం.


Tags:    

Similar News