నేడు ఈడీ కస్టడీకి నిందితులు

చైనా బెట్టింగ్ యాప్స్ స్కామ్ లో నేడు ఈడీ కస్టడీకి నిందితులు మరొకసారి తీసుకోనున్నారు. ముగ్గురు నిందితులను 8 రోజుల పాటు ఈడి విచారించనుంది. ధీరజ్ సర్కార్, [more]

Update: 2020-09-23 03:41 GMT

చైనా బెట్టింగ్ యాప్స్ స్కామ్ లో నేడు ఈడీ కస్టడీకి నిందితులు మరొకసారి తీసుకోనున్నారు. ముగ్గురు నిందితులను 8 రోజుల పాటు ఈడి విచారించనుంది. ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనా కు చెందిన లిన్ యాంగ్ హు లను కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలు నుంచి అధికారులు తమ కస్టడీలోకి లోకి తీసుకోనున్నారు. చైనాకు చెందిన మింగ్ యాంగ్, జింగ్ యాంగ్ తో పాటు డిల్లీ కిచెందిన నీరజ్ కుమార్ కీలక సూత్రదారులు గా ఉన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుల పై గతంలో ఈడీ కేసు నమోదయింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియా చైనాకు చెందిన బీజింగ్ కంపెనీ నడుపుతుంది. ఏడాదిలో ఇండియాలో రెండు వేల కోట్ల లావాదేవీలు జరిపింది ఈ డబ్బు మొత్తాన్ని కూడా చైనాకి తరలించినట్లు గా నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా హైదరాబాదులోని సి సి ఎస్ ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. డిల్లీ,ముంబాయి, గురుగ్రాం,పూణేలో దేశవ్యాప్తంగా 12చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. నాలుగు హెచ్ఎస్ బిసి బ్యాంకు ఖాతాల్లో 47 కోట్లు సీజ్ చేశారు.

Tags:    

Similar News