రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్.. మంగళ వారం ఒక కీలక తీర్పు ఇవ్వబోతోంది. స్కిల్ స్కాంకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా, లేదా అనే విషయాన్నీ సర్వోన్నత న్యాయస్థానంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉదయం తేల్చనుంది.

Update: 2024-01-14 07:28 GMT

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్.. మంగళ వారం ఒక కీలక తీర్పు ఇవ్వబోతోంది. స్కిల్ స్కాంకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు  సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా, లేదా అనే విషయాన్నీ సర్వోన్నత న్యాయస్థానంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉదయం తేల్చనుంది. ఈ తీర్పులో వెలువడే నిర్ణయం మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన ఇతర కేసుల భవిష్యత్తు తేలుతుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయి యాభై రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

2018లో చేసిన 17 ఏ చట్టం ప్రకారం ఓ పబ్లిక్ సర్వెంట్ ను అరెస్ట్ చేయాలంటే ముందుగా ఉన్నతాధికారుల తీసుకోవాలి. చంద్రబాబును అరెస్ట్ చేసేముందు సీఐడీ గవర్నర్ అనుమతి తీసుకోలేదని టీడీపీ అధినేత తరపు లాయర్లు వాదిస్తున్నారు. ఆయనపై దాఖలైన  ఎఫ్.ఐ.ర్.ను కొట్టేయాలని సర్వోన్నత న్యాయ స్థానానికి విన్నవించారు. 2018లో ఈ చట్టం రాకముందే స్కిల్ క్యాంపై ఈడి దర్యాప్తు మొదలు పెట్టిందని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఆయనకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. 

అక్టోబర్లో ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ స్కాం, ఇసుక, మద్యం కుంభ కోణాల భవిష్యత్తు కూడా సుప్రీమ్ తీర్పుతో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీ నాడు ఉదయం అసలు చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందా లేదా అనే విషయం తేలుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో ఇప్పటికిప్పుడు ఆయనకు వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు 17a విషయంలో చంద్రబాబును సమర్థిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎన్నికల నేపథ్యంలో 16వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags:    

Similar News