బ్రేకింగ్ : ఎన్ కౌంటర్ పై సుప్రీంలో

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ సమయంలో ఎవరెవరు ఉన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్ కౌంటర్ [more]

Update: 2019-12-12 06:04 GMT

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ సమయంలో ఎవరెవరు ఉన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్ కౌంటర్ చేశారని పిటీషనర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ తరుపు న్యాయవాది రోహత్గీ సమాధానమిస్తూ నిందితులు తుపాకీతో ఫైర్ చేసినందునే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. నలుగురు నిందితులు పోలీసులపై దాడిచేశారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నలుగురు నిందితులు దాడి చేయడంతోనే పోలీసులు గాయపడ్డారని రోహత్గీ చెప్పారు. ఎన్ కౌంటర్ సమయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిందితుల ఫైర్ చేసిన బుల్లెట్లు పోలీసులకు తాకలేదని, అయితే గాయపడ్డారని రోహత్గీ తెలిపారు. ఎన్ కౌంటర్ పై స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలనుకుంటున్నామని చీఫ్ జస్టిస్ తెలిపారు. గతంలో రిటైర్డ్ జడ్జి తో కొన్ని కేసుల్లో విచారణ జరిపారని, సిట్టింగ్ జడ్జి విచారించలేరని రోహత్గీ తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుంది.

Tags:    

Similar News