ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

ఆర్టీసీ కార్మిక సంఘాలతో సోమేష్‌కుమార్‌ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె యదా విధిగా ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం [more]

Update: 2019-10-02 11:02 GMT

ఆర్టీసీ కార్మిక సంఘాలతో సోమేష్‌కుమార్‌ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె యదా విధిగా ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని తెలిపాయి. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్లాన్ బీ రెడీ చేసినా సమ్మె మాత్రం ఆగదని హెచ్చరించాయి. ఆర్టీసీ కార్మికులు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరాయి. గతంలోనూ అనేక కమిటీలు వేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.

సమయమివ్వండి….

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ ఇవ్వాళ భేటీ అయ్యింది. ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలతో చర్చించింది. దసరా పండుగ దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల 26 డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గడువు కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను కోరినట్లు వెల్లడించారు. సమ్మెపై ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బి రెడీగా ఉన్నాయని స్పష్టం చేశారు సోమేష్ కుమార్.

 

Tags:    

Similar News